జీసస్ మరియు ముహమ్మద్
అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!
బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో
జీసస్ (యేసు) - ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ
ఉపోద్ఘాతం
అన్ని విధాల ఘనతలకు, గౌరవ మర్యాదలకు, సత్కారములకు, కీర్తిప్రతిష్టలకు యోగ్యుడైన ఆ ఏకైక సర్వలోక సర్వాధికారికే సకల ప్రశంసలు చెందుతాయి. ఆయన పరిపూర్ణమైన లక్షణాలన్నీ కలిగి ఉన్న ఏకైకుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాదు. ఆయనకు సరిసమానుడెవరూ లేరు. అయనే సర్వలోక శక్తిమంతుడైన, ఏకైక దివ్యశక్తి.
‘అన్ని రకాల ఆరాధనలకు అర్హత కలిగిన, ఏకైకుడైన ఆయననే కేవలం ఆరాధించమని బోధిస్తూ మరియు బహుదైవారాధన, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు భాగస్వాములను జతచేయడం, సృష్టితాలను ఆరాధించటం మొదలైన అత్యంత ఘోర పాపముల యొక్క శాశ్వతమైన, భయంకరమైన, భరించలేని దుష్పరిణామాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ’ మానవాళికి ఏకైక దైవత్వపు మార్గదర్శకత్వాన్ని వహించటానికి, ఆయన తన సందేశహరులను, ప్రవక్తలను పంపాడు.
అల్లాహ్ యొక్క అందరు ప్రవక్తల పై, సందేశహరుల పై ముఖ్యంగా అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ప్రళయ దినం వరకు ఆయనను ధార్మికంగా అనుసరించే వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు కలుగు గాక . ఆమీన్!!
బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను
బైబిల్ యొక్క క్రొత్త నిబంధనలలో అంటే మత్తాయి గోస్పెల్ లోని నాలుగవ అధ్యాయంలోని ఆరవ మరియు ఏడవ వచనంలో ‘జీసస్ - మరణాన్ని తప్పించుకోలేని ఒక విధేయుడైన దైవదాసుడని (an obedient mortal), ఇంకా దైవమే అతడి యజమాని మరియు ప్రభువని’ ఏడవ వచనంలోని జీసస్ బోధనలలో స్పష్టంగా ఉన్నది.
"ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను".
ఈ అధ్యాయంలో వాస్తవానికి సైతాను మెస్సయ్యా ను ఒకచోట నుండి మరొక చోటుకు మోసుకుంటూ పోయాడని మనం చదువుతాం. సైతాను దేవుడిని ఎలా మోసుకు పోగలడు? సకల ప్రశంసలకు అర్హుడైన అల్లాహ్ మహోన్నతుడు. అటువంటి అపనిందలు blasphemy ఆయన దరిదాపులకి కూడా చేరలేవు!
అప్పుడు సైతాను ఆయనను తన ముందు సాష్టాంగ పడమని మరియు తనను ఆరాధించమని ఆజ్ఞాపించినది. ఇంకా ప్రాపంచిక భోగభాగ్యాలను ప్రసాదిస్తానని ఆశ చూపినది. ఎరగా చూపించినది. సైతాను దేవుడితో నిర్భయంగా అలా పలికే సాహసం ఎలా చేయగలదు? ఎప్పుడైతే సైతాను జీసస్ ను తన ఆజ్ఞలను అనుసరించమని ఆదేశించినాడో, ఇలా (పూర్వగ్రంథాలలో) వ్రాయబడి ఉన్నదని సైతానుకు జీసస్ జవాబిస్తారు:"ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను". Matthew 4:10
దేవుని బిడ్డ
Son of God దేవుని బిడ్డగా జీసస్ తనను తాను ఏనాడూ పిలుచుకోలేదు కాని మనిష్య కుమారునిగా (Mark 2:10) ఆయన తనకు తాను పిలుచుకుని ఉన్నాడు. బైబిల్ తో తెలిపినట్లుగా, ఎవరైనా అలా పిలిచినా ఆయన వారించ లేదు ఎందుకంటే అలాంటి పిలుపును కేవలం తన కోసమే ప్రత్యేకించుకోలేదు.
పాత, క్రొత్త నిబంధనలలోని బైబిల్ పదాల పరిభాష ప్రకారం దేవుడి భయభక్తులు గల ప్రతి ఒక్క పుణ్యపురుషుడు ‘Son of God’ దేవుని బిడ్డగా పిలవబడును.
Matthew 5:9 లో మనం ఇలా చదువుతాం: "సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనుబడుదురు"
మత్తయి 5:44లో - "మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు"
ప్రభువే తండ్రి
Matthew 5:48 లో–"మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు"
Matthew 6:1 లో– "లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు".
Matthew 7:21 లో – "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును".
గమనిక – ఇక్కడ వాడబడిన ‘Lord ప్రభువా’ అనే పదం అరబీ భాషలోని బైబిల్ లో ‘రబ్’ అని అనువదించబడినది. అలా చేయటం ద్వారా ప్రజలను ‘జీసస్ యే దేవుడు!’ వొప్పించవచ్చును. కాని మిగిలిన ఆ వచనాన్ని పూర్తిగా చదివినట్లయితే, అసలైన దేవుడికి మెసయ్యా – జీసస్ విధేయతగా, అణుకువగా తన ఇచ్ఛను సమర్పించుకున్నాడనే విషయం పై ఆ వచనం సాక్ష్యమిస్తున్నదని గమనిస్తారు. కావున అక్కడ ఉండవలసిన సరైన అనువాదం :
“నాతో ‘ఓ యజమాని, ఓ యజమాని’ అని పలికిన ప్రతివారూ స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించరు. కాని స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛానుసారం జీవించివారే స్వర్గంలో ప్రవేశిస్తారు.”
బైబిల్ లోని పై వచనాన్ని చదవటం ద్వారా ‘Father - తండ్రి’ అనే పదం అనేక చోట్ల అసలైన దేవుడి కోసం వాడబడినది. ఆ పదం కేవలం జీసస్ కోసమే ప్రత్యేకంగా వాడబడలేదు.
Matthew 11:25 లో – "ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను"
జీసస్ అలైహిస్సలాం– ఏక దైవారాధకుడు, దైవభక్తుడు
Matthew 14:23 లో – "ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ యెక్కి పోయి, ...".
ఒకవేళ జీసస్ యే గనుక దేవుడైతే లేక దైవుడిలోని భాగమైతే ఆయన ఎందుకు ప్రార్థిస్తాడు? వాస్తవానికి ప్రార్థన అనేది సమర్పించుకున్న వారి వైపు నుండి, అవసరాలున్న వారి వైపు నుండి మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారి వైపు నుండి ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటిస్తున్నాడు:
“ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే. వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు” (V. 35:15)
“ఎందుకంటే భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు” (V. 19:93)
బైబిలులోని ఒక వృత్తాంతం.
Matthew 15: 22 – 28 – "ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి - ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసెను! అందుకాయన ఆమెతో ఒక్క మాట యైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని అనెను. ఆయనను వేడుకొనగా! ఆయన - ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ లేదనెను! అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను! అందుకాయన - పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా! ఆమె - నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను! అందుకు యేసు - అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను."
కనాన్ కు చెందిన ఒక స్త్రీ కు చెందిన ఈ వృత్తాంతంలో గమనించ దగిన కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి:
ఇక్కడ ప్రవక్త జీసస్ (ఈసా) అలైహిస్సలాం పై దయాదాక్షిణ్యాలు మరియు ప్రేమాభిమానాలు లేనివారుగా ఇక్కడ భాండం వేయబడినది, నింద మోపబడినది. (ఒకవేళ ఆ వృత్తాంతం కరక్టుగా వ్రాయబడి ఉన్నట్లయితే)
1. ఆయన తన తెగనే ఉన్నతమైన మార్గం వైపు తీసుకుపోతూ, ఇతరులను చిన్నబుచ్చి కులవిచక్షణ చూపినట్లు తెలుపబడినది.
2. ఆయన ఇతర తెగలను కుక్కలని పిలిచి దురభిమానం చూపిస్తూ, వారిపై తన తెగ వారికి దర్పాన్ని ఇచ్చినట్లు పేర్కొనబడినది.
3. ఇక్కడ అజ్ఞానంలో మునిగి ఉన్న బహుదైవారధకురాలైన ఒక స్త్రీ ఆయనతో వాదులాడి, గెలిచినది అని తెలియజేయబడినది.
జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త
Matthew 19:16 – 17 "ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను! అందుకాయన - మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను". పై వచనంలో అల్లాహ్ వైపునకు ఆయన యొక్క విధేయతా పూర్వకమైన సమర్పణ కనబడుతున్నది.
Matthew 21:45 – 46 "ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి! ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి".
జీసస్ ను ఆయన జీవితకాలంలో విశ్వసించిన సహచరులు, వారిని దేవుడని లేక దేవుడి కుమారుడని లేక ట్రినిటీలో తెలిపిన విధంగా ముగ్గురిలో ఒకరని నమ్మలేదని ఇక్కడు ఋజువు అవుతున్నది; కాని వారు ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే విశ్వసించారని తెలుస్తున్నది.. ఎవరైతే జీసస్ కు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారో, వారికి వ్యతిరేకంగా నిరూపితమైన ఒక బలమైన ఆధారం. కృతనిశ్చయంతో, చిత్తశుద్ధితో గమనిస్తేనే వారు దీనిని గ్రహించగలరు.
జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.
Matthew 23:8 – ‘But be not ye called Rabbi: for one is your master, even Jesus, and all ye are brethren.’ "మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు". ("Even Jesus" యొక్క అనువాదం తెలుగు బైబిల్ లో లేదు)
జీసస్ ఇక్కడ అల్లాహ్ యొక్క దాసుడని. ఇంకా, అక్కడ ఒకే ఒక యజమాని ఉంటాడని ఆయనే అల్లాహ్ అని ఋజువు అవుతున్నది. అరబీ భాషలోని బైబిల్ లో జీసస్ ను యజమాని అనే అర్థం వచ్చేటట్లుగా అనువదించారు. కాని ఇంగ్లీషు అనువాదం లో అలా చేయక పోవటం వలన వాస్తవ భావానికి కొంచెం చేరువలో ఉన్నది.
Matthew 23:9 – "మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోక మందున్నాడు".
పితృత్వం మరియు పుత్రత్వం అనేది దైవానికి మరియు ఆయన దాసులకు మధ్య ఉన్న సంబంధమని దీని ద్వారా మీరు గమనించగలరు: ఇది సాధారణ పదంగా వాడబడినదే గాని జీసస్ కోసం ప్రత్యేకించబడలేదు.
Matthew 24:36 – "అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు."
అంతిమ ఘడియ గురించి కేవలం ఒక్క అల్లాహ్ కు మాత్రమే తెలుసుననటానికి ఇది ఒక ఖచ్చితమైన ఋజువు. కాబట్టి జీసస్ యొక్క జ్ఞానం ఇతర మానవుల వలె అసంపూర్ణమైనది. కేవలం అల్లాహ్ మాత్రమే అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు.
Matthew 26:39 – "కొంత దూరము వెళ్ళి సాగిలపడి - నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయనను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను".
ఇక్కడ అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలకు సమర్పించుకోవటం గురించే కాక ఆయన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవం గురించి కూడా ప్రస్తావించబడినది. కేవలం అల్లాహ్ మాత్రమే దేనినైనా మార్చగలడు.
బైబిల్ సంకలనం
Matthew 27:7 – 8 – "కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి! అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది".
బైబిల్ (కొత్త నిబంధనలు) జీసస్ కాలంలో వ్రాయబడలేదని, ఆ సంఘటనలు జరిగిన చాలా కాలం తర్వాత ప్రజల జ్ఞాపకాలలో నుండి వెలికితీసి వీటిని వ్రాయటం జరిగినదని ఈ వచనాల ద్వారా స్పష్టమవుతున్నది.
Matthew 27:46 – “And about in the ninth hour Jesus cried with a loud voice, saying, ‘Eli, Eli, Iama sabachthani? (My God, My god, why hast Thou forsaken me?’)”
"ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు - ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. (తెలుగు బైబిల్ ISBN 81-221-3755-5 లో మూడు గంటలనే ఉన్నది.)
తనను శిలువ మీద పెట్ట చిల్లులు కొట్టినప్పుడు జీసస్ పై వాక్యాలు బిగ్గరగా పలుకుతూ ఏడ్చినాడని క్రైస్తవుల అభిప్రాయం. ఇది జీసస్ పై మోపబడిన ఒక ఘోరమైన అపవాదు. ఈ పదాలను గమనించినట్లయితే, అలాంటివి కేవలం అవిశ్వాసుల నుండి మాత్రమే వెలువడగలవని తెలుస్తుంది. ఇంకా, అలాంటి పదాలు అల్లాహ్ యొక్క ప్రవక్త నుండి వెలువడినాయనటం ఒక అమితాశ్చర్యకర మైనది. ఎందుకంటే అల్లాహ్ ఎప్పుడూ తన వాదనను భంగం చేయడు మరియు ఆయన ప్రవక్తలు ఆయన వాదనాభంగం గురించి ఆయనకు ఏనాడూ ఫిర్యాదు చేయరు.
జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు
John 17:3 లో– "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము".
Mark 12:28 – 30 "శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి - ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను! అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు! నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ".
Mark 12:32 – "ఆ శాస్త్రి - బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే".
Mark 12:34 – "... నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను".
పై వచనాలలో, జీసస్ అలైహిస్సలాం స్వయంగా సాక్ష్యం ఇలా ఉన్నది – అల్లాహ్ ఒకే ఒక ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆరాధ్యులు లేరు, అల్లాహ్ యొక్క ఏకైకత్వాన్ని విశ్వసించిన వారు ఆయన యొక్క సామ్రాజ్యానికి దగ్గరలో ఉంటారు. కావున, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వారు లేదా ట్రినిటీలో నమ్మకం ఉంచినవారు ఆయన యొక్క సామ్రాజ్యానికి బహుదూరంగా ఉంటారు, మరియు వారు అల్లాహ్ కు శత్రువులుగా పరిగణింపబడతారు.
Matthew 24:36 – "అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు"
‘అంతిమ ఘడియ ఎప్పుడు వస్తుందో ఒక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు’ అనే ఖుర్ఆన్ లోని ప్రకటన లాంటిదే మత్తాయి బైబిల్ లో కూడా ఉన్నది. ఇంకా అల్లాహ్ కు జీసస్ విధేయతాపూర్వకంగా సమర్పించుకున్నాడని మరియు దైవత్వంలో ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేదనే వాస్తవాన్ని ధృవీకరిస్తుంది: ఆయన దేవుడి అవతారమనే విషయం కేవలం కనాన్ ప్రజల కల్పితం మాత్రమే.
John 20:16 – 18 "యేసు ఆమెను చూచి - మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము! యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి - నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పు మనెను! మగ్దలేనే మరియ వచ్చి - నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను".
పై వచనాలలో జీసస్ చాలా స్పష్టంగా ‘అల్లాహ్ యే తన దైవమని మరియు మిగిలిన వారి దైవమని, అల్లాహ్ యొక్క ఆరాధనలో తనకు మరియు వారికి ఎటువంటి భేదం లేదని’ ధృవీకరించెను. జీసస్ కూడా దేవుడే అనేవారు తప్పక అల్లాహ్ పై ఘోర అపనింద మోపినవారవుతారు మరియు జీసస్ ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ, అల్లాహ్ యొక్క సందేశహరులందరినీ మోసం చేసిన వారవుతారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు
John 14:15 – 16 – “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు! నేను తండ్రీని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకైన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.”
ముస్లిం ధర్మవేత్తలు ఇలా తెలిపారు - “మరొక ఆదరణ కర్త” అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం; మరియు “ఎల్లప్పుడూ ఉండేది” అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మాదేశాలు మరియు ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్.
John 15:26 – 27 – "తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన అత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును! మీరు మొదటనుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు"
John 16:5 – 8 – "ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్ళుచున్నాను - నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దు:ఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును"
John 16:12 – 14 – "నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు! అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును! ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును."
John 16:16 – "కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను".
ముస్లిం ధర్మవేత్తల ఇలా ధృవీకరిస్తునారు - పైన తెలిపిన బైబిల్ వచనాలలో జీసస్ తర్వాత వచ్చే ప్రవక్త గురించిన వివరణలు కేవలం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోనే ఏకీభవిస్తున్నాయి. తన తర్వాత వచ్చే అతని పేరును జీసస్ ‘Parqaleeta’ అని పిలిచెను. ఈ పదాన్ని తర్వాతి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, అనువాదకర్తలు తొలగించివేసి, క్రమంగా దానిని ‘Spirit of Truth’ సత్యమైన ఆత్మ అని, మరికొన్ని చోట్ల, ‘Comforter’ ఆదరణకర్త అని మరియు మరికొన్ని చోట్ల ‘Holy Spirit’ దివ్యాత్మ అని మార్చివేసినారు. దీని అసలు పదం గ్రీకు భాషలో ఉన్నది. దాని అసలు అర్థం ‘one whom people praise exceedingly - ప్రజలచే అపరిమితంగా ప్రశంసించ బడేవాడు’. ఇదే పదం అరబీ భాషలోని ‘Muhammad అంటే ప్రశంసింపబడేవాడు’ అనే పదానికి సరిగ్గా సరిపోతున్నది.
శిలువ గాథ పై కల్పించబడిన వాదనల పై చివరి మాట
1) జీసస్ యొక్క ముఖము యూదులకు తెలుసునని బైబిల్ సాక్ష్యమిస్తున్నది; జెరుసలెంలోని సోలొమాన్ ఆలయంలో ఆయన వారికి బోధించేవారు, ఉపదేశాలు చేసేవారు. కాబట్టి, మత్తాయి బైబిల్ తెలిపినట్లు, ముప్పై వెండినాణాలకు ఒక యూదుడిని బాడుగకు కుదుర్చుకోవటం అనవసరమైన విషయం కాదా?
2) 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot అనే అతడిని జీసస్ ను చూపటానికి బాడుగకు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీసస్ ను శిక్షించటం చూసి, అతడు చాలా సిగ్గుపడి, వారి ఆ పని తనను తాను వేరు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 24గంటల లోపు జరిగి పోయినది. ఇందులోని వ్యత్యాసములు చాలా స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.
3) యూదులు జీసస్ కు మరణశిక్ష విధించి, అనుమతి కోసం పిలాతు Pontius Pilate అనే గవర్నరు వద్ద అనుమతి పొందటానికి ప్రయత్నించిన స్పష్టమైన క్రింది సంఘటన ఒక్కటి చాలు, జీసస్ యొక్క శిలువ వృత్తాంతంలోని అసత్యాలను బయటికి లాగటానికి.
Matthew 27:11 – 14 – "యేసు అధిపతి యెదుట నిలిచెను; అప్పుడు అధిపతి - యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి - నీవన్నట్టే అనెను! ప్రధాన యాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు! కాబట్టి పిలాతు - నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను! అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కలి ఆశ్చర్యపడెను".
పై వృత్తాంతానికి క్రైస్తవులు ఇచ్చే వివరణ – సమస్త మానవాళి విముక్తి కోసం, విమోచన కోసం, మోక్షం కోసం మరియు మానవాళి యొక్క పాప ప్రక్షాళణ కోసం, ఇంకా వాటిని క్షమింపజేయటానికి జీసస్ శిలువ పై కెక్కి మరణించాలని కోరుకున్నాడు. ఒకవేళ అదే నిజమైతే, జీసస్ ఎందుకని మరణం నుండి తనను తప్పించమని అడిగినాడు? శిలువ మీద నుండి (వారి అభిప్రాయం ప్రకారం) ఆయన ఎందుకు ఇలా ఏడ్చినాడు: “ఓ దేవా, నన్నెందుకు విడిచి పెట్టినావు?” సత్యాన్ని ఆక్షేపిస్తున్నప్పుడు, సవాలు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించాడు? ఆయన ఆత్మలను ప్రేరేపించే విధంగా యూదు పండితులను సవాలు చేస్తూ, ఉపన్యాసాలు ఇవ్వడంలో ప్రఖ్యాతి గాంచినాడు. ఊహలో ఉన్న ఏ వ్యక్తి అయినా దీనిని ఎలా నమ్మగలడు? ఒకవేళ శిలువ వృత్తాంతమే సత్యమైనదిగా ఋజువు కాకపోతే, దాని ఆధారం పైనా ఉన్న మొత్తం క్రైస్తవపు పునాదులే కదిలిపోతాయి.
యూదులచే జీసస్ శిలువపై చంపబడలేదు అనేది ముస్లింల విశ్వాసం. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి: “మరియు వారు: ‘నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యం కుమారుడైన ఈసా మసీహ్ (యేసు క్రీస్తు) ను చంపాము’ అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువ పై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురిచేయబడ్డారు (అతని లాంటి మరొక వ్యక్తిని శిలువ పైకి ఎక్కించారు). నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊపలనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు.” V. 4:157, 158
మొత్తం క్రైస్తవులతో పాటు యూదులు కూడా స్వయంగా జీసస్ శిలువ పై మరణించాడనే విశ్వసించారు. వారి అభిప్రాయాలకు విరుద్ధంగా, ఇస్లామీయ ప్రకటనలోని సత్యాన్ని బైబిల్ ద్వారా నిరూపించటానికి మత్తాయి కొత్త నిబంధనల (26 మరియు 27 వ అధ్యాయం) నుండి క్రింది ప్రశ్నలు తయారు చేయబడినాయి:
1) ఎవరైతే జీసస్ ను పట్టుకున్నారో (వారి అభిప్రాయం ప్రకారం), వారు జీసస్ ను వ్యక్తిగతంగా ఎరుగుదురా? లేదా వారు జీసస్ ను ఎరుగరా?
మత్తాయి బైబిలు: వారు జీసస్ ను ఎరుగరు.
2) జీసస్ ను పట్టుకున్నది పగటి వేళలోనా లేక రాత్రి వేళలోనా?
మత్తాయి బైబిలు: అది రాత్రి వేళ.
3) జీసస్ దగ్గరికి దారి చూపినది ఎవరు?
మత్తాయి బైబిలు: 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot దారి చూపాడు.
4) అతడు వారిని ఉచితంగా దారి చూపాడా లేక వారు ఆశ చూపిన నిశ్చిత మూలధనం కోసం దారి చూపాడా?
మత్తాయి బైబిలు: 30 వెండి నాణాల బహుమతి కోసం అతడు దారి చూపాడు.
5) ఆ రాత్రి జీసస్ పరిస్థితి ఎలా ఉండినది?
మత్తాయి బైబిలు: జీసస్ భయపడుతూ ఉన్నాడు మరియు ఇలా ప్రార్థిస్తూ సాష్టాంగ పడి ఉన్నాడు: “ఓ దేవా, ఈ కప్పును నా నుండి దాటిపోనివ్వడం నీకు సాధ్యమే అయితే దీనిని దాటి పోనివ్వు.” ఇటువంటి మాటలు ఒక నిజమైన దైవవిశ్వాసి నుండి వెలువడటం అనేది నమ్మశక్యం కాని అత్యంత విడ్డూరమైన విషయం. దైవ ప్రవక్త విషయం ప్రక్కన పెట్టి, ఒక మామూలు దైవవిశ్వాసిలోని విశ్వాసమే గమనించి నట్లయితే, ఆ ఏకైక దైవానికి అన్నింటి మీదా శక్తి సామర్థ్యాలున్నాయని వారు ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు.
6) జీసస్ యొక్క మిగిలిన 11 మంది సహచరుల పరిస్థితి ఏమిటి?
మత్తాయి బైబిలు: భయం వలన (వారి అభిప్రాయం ప్రకారం) వారి బోధకుడితో పాటు వారి పైకీ నిద్ర ఆవరించినది.
7) వారి పరిస్థితితో జీసస్ పోరాడినాడా?
మత్తాయి బైబిలు (verses 40 – 46): ఆయన తృప్తి చెందలేదు. ఆయన వారి దగ్గరికి వచ్చి ఇలా పలుకుతూ, వారిని లేపినాడు: “చూడండి మరియు ప్రార్థించండి, మీరు ప్రలోభానికి గురికాకుండా ఉండటానికి; ఆత్మ నిశ్చయంగా సమ్మతిస్తున్నది కాని మాంసపు కండ బలహీనంగా ఉన్నది.” అప్పుడు ఆయన మరల వచ్చి చూడగా, వారు నిద్రలో ఉంటారు. మరియు వారిని ఆయన మరల నిద్రలేపి, పై వాక్యాలనే తిరిగి పలుకుతాడు. ఇలాంటి బలహీనత సరైన ఉత్తమమైన శిష్యులలోనే కాకుండా అతి మామూలు దైవభక్తి గల బోధకుడి మామూలు శిష్యులలో కూడా కనబడదు, మరి ఆ బలహీనత కేవలం మర్యం కుమారుడైన జీసస్ శిష్యులలో ఎలా కనబడగలదు?
8) ఆ దుష్టులు జీసస్ ను బంధించినప్పుడు, వారు ఆయనకు సహాయపడినారా?
మత్తాయి బైబిలు: వారు ఆయనను విడిచిపెట్టి పారిపోయినారు.
9) ఆ రాత్రి జీసస్ కు తన సహచురులపై నమ్మకం ఉండినదా?
మత్తాయి బైబిలు: వారందరూ తనను విడిచి పారిపోతారని జీసస్ వారికి తెలియజేసెను. ఆ తర్వాత జీసస్ వారితో ఇలా అనెను: నిశ్చయంగా ఈ రాత్రి కోడికూతకు ముందు, మీరు నన్ను వదిలి పారిపోతారు – ఇలా మూడు సార్లు అనగా, వారిలో నుండి పీటర్ అనే సహచరుడు – నేను చనిపోతాను గాని విడిచి పారిపోను అని పలికెను. అలాగే మిగిలిన సహచరులందరూ పలికిరి. మరియు అలా జరిగినది.
10) ఆ దుష్ట సైనికులు జీసస్ ను ఎలా పట్టుకున్నారు?
మత్తాయి బైబిలు: ఒక యూదుడు దారి చూపిస్తుండగా, వారు ఆయన దగ్గరకు కత్తులతో మరియు కర్రలతో వచ్చి, 57వ వచనంలో తెలిపినట్లుగా వారు ఆయనను పట్టుకున్నారు: “మరియు వారు ఆయనను గట్టిగా పట్టుకున్నారు, Caiaphas సియాఫస్ అనే వారి యొక్క మహాగురువు వద్దకు తీసుకుని పోయారు, అక్కడి వారి పెద్దలందరూ సమావేశమై ఉన్నారు.”
అక్కడ వారు ఆయనకు మరణశిక్ష విధించారు. ఆ దుష్టసైనికులు అక్కడి నుండి ఆయనను తీసుకుని పోయారు. ఆయన ముఖం పై ఉమ్మేశారు మరియు తమ చేతులతో ఆయనను మోదారు, ఆ తర్వాత ఆయన దుస్తులను చింపివేశారు. ఆ తర్వాత సిందూర వర్ణపు దుస్తులతో చుట్టివేశారు, ఆ పై ముళ్ళతో నిండి ఉన్న కిరీటాన్ని ఆయన తలపై ఉంచి, ఆయనను పీడిస్తూ, ఎగతాళి చేస్తూ పట్టుకుపోయారు. వారు ఆయనతో ఇలా పలికారు, ‘నీ దావా ప్రకారం నీవు ఇస్రాయీలుకు రాజువి.’ వారు ఆయనను తీవ్రంగా అవమానించారు.
11) చివరిగా ఆయనకు మరణశిక్ష విధించాలని ఎవరు నిర్ణయించారు?
మత్తాయి బైబిలు: ఆనాటి ఫలస్తీన్ దేశపు గవర్నరైన పిలాతు Pontius Pilate.
12) ఆ దుష్టసైనికులు ఆయనను, గవర్నరు ముందుకు తీసుకు వచ్చి, యూదుల గురువు వారి ధర్మశాస్త్రమైన తోరాహ్ ప్రకారం ఆయనకు శిలువ పైకి ఎక్కించి, చంపాలనే మరణశిక్షను విధించాడని తెలియజేయగా, ఆ గవర్నరు విచారించకుండానే, పరిశోధించకుండానే వారిని నమ్మినాడా?
మత్తాయి బైబిలు: ఆ గవర్నరు వారిని నమ్మలేదు, కాని ఆయనను ప్రశ్నించాడు: “వారు ఏదైతే చెప్పినారో, అది నిజమేనా?” ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయెను. ప్రశ్న మరల మరల అడుగ బడినది మరియు ఆయన అలాగే నిశ్శబ్దంగా ఉండెను. సత్యం కోసం ఆయన నిశ్శబ్దంగా ఉండెను.; ఒకవేళ ఆయన ప్రవక్త కాకపోయినా సరే, సత్యాన్ని స్పష్టం చేయటం మరియు యూదుల అపనిందలను నిరాకరించటం తప్పనిసరి. గవర్నరు భార్య, గవర్నరు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలికినది: “మీరు ఆ మంచి వ్యక్తిని ఏమీ చేయకుండా వదలలేరా? ఆయన కారణంగా నాకు ఈ రోజున కలలో అనేక సంఘటనలు జరిగినవి.”
యూదులను తిరస్కరిస్తూ మరియు హెచ్చరిస్తూ గంటల తరబడి జీసస్ అనేక ఉపన్యాసాలు ఇచ్చేవాడని, దీని వలన వారు జీసస్ ను నిందిచేవారని బైబిల్ ప్రకటిస్తున్నది. మరి ఆ రోజున ఆయన నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయాడు? ఆయనను మాటిమాటికీ ప్రశ్నించటంలో ఆ గవర్నరు యొక్క ఉద్ధేశం సత్యం వైపు నిలబడాలని అయిఉండవచ్చును.
13) వారి ఊహల ప్రకారం జీసస్ ఎలా శిలువ పైకి ఎక్కించబడి, హత్య చేయబడినాడు?
మత్తాయి బైబిలు: వారు జీసస్ ను ఇద్దరు దొంగల మధ్య శిలువ పైకి ఎక్కించారు, ఆ దొంగలు జీసస్ ను దూషిస్తూ ఇలా పలికినారు, “నీవే గనుక సత్యవంతుడివైతే, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో.”
14) ఇది ఒక మహా ఉపద్రవం. జీసస్ (వారి అభిప్రాయం ప్రకారం) శిలువ పై ఉండగా ఏమని పలికెను?
మత్తాయి బైబిలు (27:46): జీసస్ ఏడుస్తూ, బిగ్గరగా ఇలా పలికినాడు “Eli, Eli, Iama sabachthani? అర్థం – నా ప్రభూ, నా ప్రభూ, నన్ను ఎందుకు విడిచి పెట్టివేసినావు?”
అన్ని ధర్మాల ప్రామాణిక నియమాలను అనుసరించి ఇది ఒక పచ్చి అవిశ్వాసపు ప్రకటన. అవతరింపజేయబడిన ధర్మాలను అనుసరించి, ఎవరైనా ఇటువంటి వాక్యాలను ఒక ప్రవక్త పై చెప్పి నట్లయితే, వారు అవిశ్వాసులు అవుతారు.
సర్వలోక శక్తమంతుడైన అల్లాహ్ ఖుర్ఆన్ లో యూదులను మరియు క్రైస్తవులను – జీసస్ అల్లాహ్ యొక్క అవతారమనే, అల్లాహ్ యొక్క కుమారుడనే, పూర్తిగా జీసస్ నే తిరస్కరించేటటు వంటి వారి అపనిందల గురించి హెచ్చరిస్తూ, వారు జీసస్ ను కేవలం అల్లాహ్ యొక్క సందేశహరుడిగానే విశ్వసించమని దివ్యఖుర్ఆన్ (V. 4:159) లో ఆజ్ఞాపిస్తున్నాడు: “మరియు గ్రంథ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ మరణం సంభవించక ముందే ఆయనను (జీసస్ ను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని) తప్పక విశ్వసించవలెను. మరియు పునరుత్థాన దినాన ఆయన (ఈసా) వారి పై సాక్ష్యమిచ్చును”
No comments:
Post a Comment