Monday, February 14, 2011

కారణం లేకుండా హజ్జ్ యాత్ర ఆలస్యం చేయటం


జ్జ్ చేయగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ, కారణమూ లేకుండానే దానిని ఆలస్యం చేసేవారి గురించి ఇస్లామీయ ఆదేశం ఏమిటి?

అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్సకల ప్రశంసలు అల్లాహ్ కే మరియు ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతియు కురుయుగాక!

తగిన అర్హత, శక్తిసామర్థ్యం, సౌకర్యం మరియు ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ముస్లిం, జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పని సరిగా హజ్జ్ యాత్ర చేయవలసి యున్నది. కారణమూ లేకుండా హజ్జ్ చేయటంలో ఆలస్యం చేసేవారు చాలా పెద్ద తప్పు చేస్తూ, ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారు. అలాంటి వారు వెంటనే అల్లాహ్ వద్ద తౌబా చేసుకుని (పశ్చాత్తాప పడి), త్వరగా హజ్జ్ యాత్ర పూర్తి చేయవలెను.

దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావానికి అనువాదం): ప్రజలపై అల్లాహ్ కు ఉన్న హక్కు ఏమిటంటే, గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్జ్ ను విధిగా చెయ్యాలి. ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహ్ కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి.[ఆలె ఇమ్రాన్ 3:97] మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: ఐదు మూలస్థంభాలపై ఇస్లాం నిర్మించబడి ఉన్నది: అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవ్వడు లేడు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమివ్వటం; నమాజు స్థాపించటం; జకాహ్ (విధిదానం) చెల్లించటం; రమదాన్ ఉపవాసాలు, మరియు కాబాగృహానికి హజ్జ్ యాత్ర చేయటం.” (బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన సహీహ్ హదీథ్).

దైవదూత జిబ్రయీలు(అలైహిస్సలాం) ఇస్లాం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించినప్పుడు, ఆయన ఇలా జవాబిచ్చినారు: “అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవ్వడు లేడు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమివ్వటం; నమాజు స్థాపించటం; జకాహ్ (విధిదానం) చెల్లించటం; రమదాన్ ఉపవాసాలు, మరియు అవసరమైన సౌకర్యాలు కలిగి ఉంటే కాబాగృహానికి హజ్జ్ యాత్ర చేయటం.” (ముస్లిం హదీథు గ్రంథంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లుహు అన్హు ఉల్లేఖన ఆధారంగా హదీథు నమోదు చేయబడినది). మన శక్తిసామర్థ్యాలకు మూలాధారం అల్లాహ్ యే.

No comments:

Post a Comment